- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today gold price : పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు
నిన్న భారీగా పెరిగిన బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది.

దిశ, వెబ్‍డెస్క్: నిన్న (గురువారం) భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో స్థానిక బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి.. రూ.1,52,350గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి.. రూ.1,39,650కి దిగొచ్చింది. బంగారంతో పోలిస్తే వెండి ధరలో భారీ తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,65,000 కి చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ, ధరలు స్వల్పంగానైనా తగ్గడం సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే.. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, డాలర్ విలువలో మార్పుల వల్ల ధరల్లో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో అంచనా వేయడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






