షాకింగ్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

by Naga Rani Yarlagadda |

గడిచిన రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి.

షాకింగ్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. సోమ, మంగళవారాల్లో భారీగా తగ్గిన బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.760 పెరగడంతో ధర రూ.1,21,580కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.700 పెరగ్గా.. ధర రూ.1,11,450కి ఎగబాకింది. వరుసగా మూడోరోజూ బంగారం ధర తగ్గుతుందని ఎదురుచూసిన పసిడి ప్రియులకు నిరాశ ఎదురైంది.

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నిన్న కిలో వెండిపై ఏకంగా రూ.5000 తగ్గిన విషయం తెలిసిందే. నేడు కిలో వెండి ధరపై రూ.1000 పెరిగింది. దీంతో వెండి రేటు రూ.1,66,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Next Story