- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
online delivery companies : ధనత్రయోదశికి ఇంటికే బంగారం, వెండి..ఆన్ లైన్ డెలివరీ సంస్థల దూకుడు
దీపావళి పండుగకి ముందు ధనత్రయోదశి(ధంతేరాస్ Dhanathrayodashi) పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : దీపావళి పండుగకి ముందు ధనత్రయోదశి(ధంతేరాస్ Dhanathrayodashi) పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి వంటివి కొనుగోలు చేయడం శుభప్రదమని, లక్ష్మి కటాక్షమని నమ్ముతుంటారు. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. ప్రజల్లో ధనత్రయోదశి(ధంతేరాస్) సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు అవసరాలపై ఫోకస్ పెట్టిన ఆన్ లైన్ డెలివరీ సంస్థలు(Online delivery companies) బంగారం, వెండి నాణేలను క్విక్ డెలివరీ చేపట్టాయి. బిగ్ బాస్కెట్, స్విగ్గీ, బ్లింక్‌ఇట్, ఇన్‌స్టా మార్ట్ కేవలం 10 నిమిషాల్లోనే బంగారం, వెండి కాయిన్‌లను ఆర్డర్ చేసిన వారి ఇళ్ళకు చేరుస్తున్నాయి. టాటా సంస్థకు చెందిన బిగ్‌బాస్కెట్ జ్యువెలరీ రిటైల్ చెయిన్ సంస్థ తనిష్కతో కలిసి కస్టమర్లకు బంగారం, వెండి నాణాలను హోమ్ డెలివరీ(Gold and silver at home) చేయనున్నాయి. ఈ డెలివరీ కూడా కేవలం 10 నిమిషాల్లోపే చేయనున్నట్లు తెలిపింది. దీనికోసం రెండు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.
ఇప్పటివరకు ఫుడ్ డెలివరీ, ఇంటి సరకులు ఇలా అన్ని రకాలను డెలివరీ చేయడంతో బిగ్ బాస్కెట్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు మెరుగైన సేవలు అందించేందుకు తనిష్క్‌తో భాగస్వామ్యం తీసుకుంది. కేవలం బిగ్ బాస్కెట్ మాత్రమే బంగారం, వెండి నాణేలను తొందరగా డెలివరీ చేయకుండా..బ్లింక్ఇట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వంటివి కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఈ క్విక్ డెలివరీ సేవలకు ప్రత్యేకించి పండుగల సీజన్‌లో డిమాండ్ పెరుగుతోంది. షాప్‌లకు వెళ్లి కొనుగోలు సమయం లేని వారికి ఈ క్విక్ డెలివరీ బాగా ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ డెలివరీ సంస్థల బిజినెస్ మరింత విస్తరించే మార్గం ఏర్పడింది. లక్ష్మీ గణేష్(999.9 స్వచ్ఛత), వెండి నాణెం(10 గ్రా), తనిష్క్ 22 క్యారెట్ గోల్డ్ కాయిన్(1 గ్రా), లక్ష్మీ (1 గ్రా) నాణెలను ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు.






