Nirmala Sitaraman: ప్రపంచ వాణిజ్యానికి టారిఫ్ 'ఆయుధంగా' మారుతోంది: నిర్మలా సీతారామన్

by S Gopi |

ఆర్థికవ్యవస్థ బలంగా మారితే, అదే దేశానికి అదనపు ప్రయోజనాన్ని అందిస్తుందని అన్నారు.

Nirmala Sitaraman: ప్రపంచ వాణిజ్యానికి టారిఫ్ ఆయుధంగా మారుతోంది: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యం టారిఫ్‌ల రూపంలో ఆయుధంగా మారుతోందని, అందుకే ఈ విషయంలో భారత్ అత్యంత అప్రమత్తతతో చర్చలు జరపాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ బలంగా మారితే, అదే దేశానికి అదనపు ప్రయోజనాన్ని అందిస్తుందని అన్నారు. టైమ్స్‌ నెట్‌వర్క్‌ నిర్వహించిన ఇండియా కాన్‌క్లేవ్‌ 2025లో మాట్లాడిన ఆమె.. కేవలం టారిఫ్‌ల గురించి మాత్రమే కాకుండా, మన ఆర్థికవ్యవస్థ మొత్తం బలం మనకు అదనపు ప్రయోజనాన్ని అందిస్తుందని తాను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా లేదనేది ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది. భారత్ తన సొంత వ్యవహారాలను మాత్రమే చూసుకుంటుందని, టారిఫ్ కింగ్ అన్నవారే ఇప్పుడు ఆ సుంకాలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. టారిఫ్‌లను అధికంగా విధించాలనే ఉద్దేశం భారత్‌కు ఎన్నడూ లేదని ఆమె స్పష్టం చేశారు.

భారత్ కేవలం అధిక దిగుమతుల నుంచి తన దేశీయ పరిశ్రమలను కాపాడుకుంటోందని తెలిపారు. వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయిందని, దీన్ని ఎవరూ పెద్దగా విమర్శించడం లేదని మంత్రి అన్నారు. గతంలో, సుంకాలు విధించడం చెడ్డ విషయమని, వాటిని ఉపయోగించకూడదని చాలా దేశాలు చెప్పేవని వివరించారు. కానీ ఇప్పుడు, కొత్త తరం నేతలు సుంకాల అడ్డంకులను విధించడం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని, ఎవరూ వారిని ప్రశ్నించడం లేదని ఆమె పేర్కొన్నారు. అమెరికా విధించిన అధిక సుంకాల కారణంగా ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Next Story