- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nirmala Sitaraman: ముడి చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం చూపదు.. నిర్మలా సీతారామన్
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఇటీవల పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందనే ఆందోళనలు అవసరంలేదని అన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా ద్రవ్యోల్బణ పెరుగుతుందనే చర్చలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఇటీవల పెరగడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందనే ఆందోళనలు అవసరంలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్దేశించిన కనిష్ట పరిమితికి దగ్గరగానే ఉంది. ముడి చమురు ధరలూ దాదాపు ఒక ఏడాది కాలంగా తగ్గుతున్నాయని ఆమె ప్రస్తావించారు. అయితే, ఇటీవల పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ప్రారంభమైన తర్వాత ధరలు పెరిగాయి. ఆ సమయంలో, భారత ముడి చమురు ధర బ్యారెల్‌కు 69.01 డాలర్ల నుంచి రోజుల వ్యవధిలో బ్యారెల్‌కు 80.16కి పెరిగిందని మంత్రి వివరించారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం, ముడి చమురు ధరలు 10 శాతం పెరిగితే, దేశంలో ద్రవ్యోల్బణం 0.30 శాతం మాత్రమే పెరగవచ్చు. అయితే, ఈ పెరుగుదల కూడా వాస్తవంలో రూపాయి-డాలర్ మారకం రేటు, ప్రపంచ చమురు సరఫరా, డిమాండ్, ఆర్థిక విధానాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు.






