Gita Gopinath: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌కు 3ఎఫ్ షాక్

by S Gopi |

ఈ ఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగితే భారత్ 'ఫుడ్, ఫ్యుయెల్, ఫర్టిలైజర్ ' కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.

Gita Gopinath: ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌కు 3ఎఫ్ షాక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద షాక్ అని, 1970ల నాటి సంక్షోభానికి మించినదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘర్షణ సుదీర్ఘకాలం కొనసాగితే భారత్ 'ఫుడ్, ఫ్యుయెల్, ఫర్టిలైజర్ ' కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. అయితే, ఉద్రిక్తతలు తొందరగా తగ్గుముఖం పడితే, తక్షణ ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని ఆమె అన్నారు. ఈ పరిణామాల మధ్య భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చు. చమురు, ఎరువుల విషయంలో భారత్ ఎక్కువగా పశ్చిమాసియా ప్రాంతంపైనే ఆధారపడుతోంది. ఇరాన్ యుద్ధం కొనసాగడం వల్ల ధరలు పెరగడం కంటే సరఫరా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో ఇరాన్ ఉద్రిక్తతలు ఎంతకాలం ఉద్రిక్తతలు కొనసాగుతాయనే దాన్ని బట్టి ప్రపంచ వృద్ధి ఉండనుంది. యుద్ధం ముగిస్తే ప్రపంచ వృద్ధి 0.3 శాతం మాత్రమే తగ్గుముఖం పట్టొచ్చు. క్రూడ్ ధరలు 100 డాలర్ల పరిధిలోనే కొనసాగితే వృద్ధి 2.5 శాతానికే పరిమితం అవ్వొచ్చని గీతా గోపీనాథ్ అంచనా వేశారు.

Next Story