- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Semiconductor: సెమీకండక్టర్ రంగంలో తగ్గిన ఉద్యోగాలు
సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నియామకాలు 15 శాతం తగ్గాయని ఓ నివేదిక తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ నెలకొన్న వాణిజ్య ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇతర పరిణామాలు సెమీకండక్టర్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఫలితనా భారత్‌లోనూ సెమీకండక్టర్ పరిశ్రమ ప్రభావితమవుతోంది. తాజా ఈ పరిస్థితుల వల్ల 2024-25లో సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నియామకాలు 15 శాతం తగ్గాయని ఓ నివేదిక తెలిపింది. ప్రధానంగా ఆగని భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రపంచ సరఫరాలో ఎదురవుతున్న సవాళ్లు కీలకమైన సవాళ్లు అని ప్రముఖ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరీర్‌నెట్ తన కొత్త నివేదికలో పేర్కొంది. గతేడాది మేలో జీసీసీల్లో దాదాపు 4,000 ఉద్యోగులను నియమించుకున్నాయి. ఇది అప్పటికీ గరిష్ఠ స్థాయి. 2025, జనవరి నాటికి 3,040కి తగ్గాయని, ఆ తర్వాత మార్చి నాటికి 3,181కి పరిమితమయ్యాయని నివేదిక వెల్లడించింది. స్వల్పంగా పెరిగినప్పటికీ, టాప్ 50 సెమీకండక్టర్ డిజైన్ పరిశ్రమల్లో యాక్టివ్ ఉద్యోగాలు 15 శాతం మేర తగ్గాయి. ప్రధానంగా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ అనలాగ్ డిజైన్ విభాగాల్లో అధిక డిమాండ్ ఉంది. మధ్య తరహా జీసీసీలు ఎక్కువ నియామకాలను చేపడుతున్నాయని నివేదిక తెలిపింది. భారత్‌లో ఉన్న సెమీకండక్టర్ డిజైన్ జీసీసీలు గత కొన్ని త్రైమాసికాలుగా నియామకాల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రపంచ సరఫరా, ఏఐ, అధునాతన కమ్యూటింగ్ లాంటి కీలక టెక్నాలజీ విభాగాల్లో అస్థిరత ఈ నియామకాలను దెబ్బతీసుకున్నాయని కెరీర్‌నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా పేర్కొన్నారు.






