- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10-20 మెట్రిక్ టన్నుల సంభావ్య బంగారు నిల్వలు గుర్తింపు..?
ఒడిశాలోని ఐదు జిల్లాల్లో.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 10-20 మెట్రిక్ టన్నుల సంభావ్య బంగారు నిల్వలను కనుగొన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని ఐదు జిల్లాల్లో.. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 10-20 మెట్రిక్ టన్నుల సంభావ్య బంగారు నిల్వల (Potential gold reserves)ను కనుగొన్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికి సోషల్ మీడియాతో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బంగారం నిల్వల స్థాయిపై ఖచ్చితమైన పరిమాణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, ప్రాథమిక భౌగోళిక అధ్యయనాలు 10-20 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఆవిష్కరణకు ప్రతిస్పందనగా, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. కొత్తగా గుర్తించిన బంగారు బ్లాక్ యొక్క చారిత్రాత్మక వేలం కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇది నిజమైతే ఒడిశా రాష్ట్రం బంగారు గనులకు (gold mines) కొత్త కేంద్రంగా ఆవిర్భవించినుంది. ఖనిజ అన్వేషణ ప్రాజెక్టుల సమయంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీటిని గుర్తించగా.. ఇది మైనింగ్, వేలం వ్యూహంపై తక్షణ ఆసక్తిని రేకెత్తించింది. దేవ్‌ఘర్ (అదాస-రాంపల్లి), సుందర్‌ఘర్, నబరంగ్‌పూర్, కియోంఝర్, అంగుల్ మరియు కోరాపుట్‌లలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మయూర్‌భంజ్, మల్కాన్‌గిరి, సంబల్‌పూర్, బౌధ్‌లలో ప్రస్తుతం బంగారం నిల్వలపై అన్వేషణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వార్తలపై ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.






