Economy: భారత వృద్ధి 6 శాతం

by S Gopi |

బ్యారెల్‌కు సగటున 120 డాలర్లకు భారత క్రూడ్ బాస్కెట్ ధర పెరిగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి సుమారు 6 శాతానికి తగ్గిపోవచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది.

Economy: భారత వృద్ధి 6 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థపై అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రభావం మరోసారి చర్చనీయాంశమైంది. బ్యారెల్‌కు సగటున 120 డాలర్లకు భారత క్రూడ్ బాస్కెట్ ధర పెరిగితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి సుమారు 6 శాతానికి తగ్గిపోవచ్చని ఈవై ఇండియా అంచనా వేసింది. ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిర్దేశించిన 6 శాతం గరిష్ట స్థాయిని తాకే అవకాశం ఉందని హెచ్చరించింది. పెరుగుతున్న ఇంధన ధరలు వినియోగదారుల ఖర్చులను పెంచి, ఆర్థిక కార్యకలాపాలపై ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో పాలసీ పరంగా చర్యలకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. రెపో రేటు పెంపు వంటి చర్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి రావచ్చని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ అన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా అస్థిరంగా మారవచ్చు. కాబట్టి, భారత్ ముడి చమురు దిగుమతుల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా, వివిధ దేశాల నుంచి కొనుగోలు చేయడం మంచిదని ఆయన సూచించారు.

Next Story