- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Prices Today : తెలుగు రాష్ట్రాల్లో ( మార్చి 25) గ్యాస్ సిలిండర్ ధరలు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్ పై తీవ్రంగా పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్ పై తీవ్రంగా పడుతోంది. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అనేక ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హాస్టళ్లు, హోటళ్లు తాత్కాలికంగా మూతపడే పరిస్థితి నెలకొంది. వంట గ్యాస్ సరఫరా తగ్గడంతో వాణిజ్య వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని ఏజెన్సీల్లో సిలిండర్ల సప్లై లేక నో స్టాక్ బోర్డులు కూడా వెలుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వెయ్యి రూపాయలకు దొరకాల్సిన సిలిండర్ మూడువేల రూపాయలకు పైనే ధర పలుకుతుంది. దీంతో వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇక కొన్ని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ : రూ. 965.00
వరంగల్ : రూ. 984.00
విశాఖపట్నం : రూ. 921.00
విజయవాడ : రూ. 937.50
గుంటూరు : రూ. 937.50






