- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price(April 02): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
ఈ రోజు(గురువారం) తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల అంతర్జాతీయ ఉద్రిక్తతల (ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. అయితే, గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.
ఈ క్రమంలో ఇటీవల పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచైన తగ్గుతాయెమో అని వినియోగదారులు ఆశపడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నెల ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచగా.. గృహవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ పైన రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ(ఏప్రిల్ 02) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965
వరంగల్: రూ.984
విశాఖపట్నం: రూ.921
విజయవాడ: రూ.937.50
గుంటూరు: రూ.937.50






