- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nitin Gadkari: ముడి ఇథనాల్‌పై జీఎస్టీ తగ్గించాలని కోరిన నితిన్ గడ్కరీ
ముడి ఇథనాల్‌ను ఇంత ఎక్కువ పన్ను రేటు విధించడం వల్ల ప్రజలు పూర్తిగా ఇథనాల్‌పై నడిచే వాహనాలను వాడేందుకు ఇష్టపడరు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టంలో ప్రధాన సవరణలకు కేంద్ర, రాష్ట్రాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రతిపాదన చేశారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు ముడి ఇథనాల్‌పై జీఎస్టీని ఇప్పుడున్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం కింద ఉపయోగించే ఇథనాల్‌పై 5 శాతం రాయితీ జీఎస్టీనే అమలు చేస్తున్నారు. అయితే, ముడి ఇథనాల్‌పై మాత్రం 18 శాతం అధిక రేటుతో పన్ను కొనసాగుతోంది. ముడి ఇథనాల్‌ను ఇంత ఎక్కువ పన్ను రేటు విధించడం వల్ల ప్రజలు పూర్తిగా ఇథనాల్‌పై నడిచే వాహనాలను వాడేందుకు ఇష్టపడరు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం లేకుండా చూడటం ద్వారా వినియోగం పెంచే అవకాశం ఉంటుంది. ముడి ఇథనాల్ ధర పెట్రోల్ ధరకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రజలు ఈ వాహనాల కోసం ఎందుకు వెళతారు? గడ్కరీ ప్రశ్నించారు. దేశంలోని 400కి పైగా ఇంధన అవుట్‌లెట్‌లు ప్రస్తుతం 100 శాతం ఇథనాల్‌ను అందిస్తున్నాయి. అయినప్పటికీ వినియోగదారుల ఆసక్తి పెద్దగా కనిపించడంలేదు. ముడి ఇథనాల్‌కు మరింత అనుకూలమైన పన్ను సవరణ జరిగితే ఈ ధోరణిని మార్చవచ్చని గడ్కరీ అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ నిర్మాణాన్ని తిరిగి మూల్యాంకనం చేసే ప్రక్రియలో ఉన్నందున గడ్కరీ ఈ విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రస్తుతం దేశ జీఎస్టీ చట్టంలో నాలుగు ప్రాథమిక శ్లాబ్‌లు ఉన్నాయి. అవి 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. ఎక్కువ వస్తువులను 5 శాతం విభాగంలోనే ఉంచారు. చాలా కాలం నుంచి 12, 18 శాతం శ్లాబ్‌లను 15-16 శాతం కింద ఒకే రేటులో విలీనం చేయాలనే డిమాండ్ పరిశ్రమల నుంచి వినిపిస్తోంది. కానీ, దీనివల్ల ఆదాయం దెబ్బ తింటుందని, రాష్ట్రాల స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందనే అభిప్రాయమూ ఉంది. ముడి ఇథనాల్‌పై జీఎస్టీ తగ్గించాలనే నితిన్ గడ్కరీ ప్రతిపాదన వల్ల దేశంలో ఇంధన, రవాణ రంగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. అత్యధికంగా చమురు దిగుమతిపై ఆధారపడిన మనకు ఈ నిర్ణయం కొంత ఊరటనిస్తుంది. ప్రత్యామ్నాయ ఇంధన వాడకానికి ప్రోత్సాహం లభిస్తుంది.






