- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fuel: ప్రభుత్వ చమురు సంస్థలకు పెట్రోల్‌పై రూ. 18, డీజిల్‌పై రూ. 35 నష్టం
దీనివల్ల పెట్రోల్ లీటర్‌పై రూ. 18, డీజిల్‌పై రూ. 35 మేర నష్టాలను ఎదుర్కొంటున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, మనదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం అందుకు తగ్గట్టు ధరలను పెంచలేదు. దీనివల్ల పెట్రోల్ లీటర్‌పై రూ. 18, డీజిల్‌పై రూ. 35 మేర నష్టాలను ఎదుర్కొంటున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పదేళ్ల క్రితమే ధరల నియంత్రణను ఎత్తివేసినప్పటికీ, ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) 2022, ఏప్రిల్ నుంచి రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేయట్లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటాయి. ఆ తర్వాత తగ్గినప్పటికీ, ఈ ఏడాది అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులతో మళ్లీ 120 డాలర్లకు పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వ ఆయిల్ రిఫైనరీలు రోజుకు రూ. 2,400 కోట్ల నష్టాలను భరిస్తున్నాయి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కంపెనీలకు నష్టం రూ. 1,600 కోట్లకు తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం దేశంలోని కీలక రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత రిటైల్ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు వెల్లడిస్తున్నాయి.






