- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FSSAI: కల్తీ ఆహారంపై కఠిన నిఘా
ఈ కొత్త వ్యవస్థ ద్వారా మార్కెట్ నుంచి నేరుగా ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆహార భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త సెంట్రలైజ్‌డ్ ఫుడ్ సర్వైయలెన్స్ సిస్టమ్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో విడివిడిగా జరుగుతున్న ఫుడ్ టెస్టింగ్, సర్వైయలెన్స్ ప్రక్రియను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ కొత్త వ్యవస్థ ద్వారా మార్కెట్ నుంచి నేరుగా ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కల్తీ, నాణ్యతలేని లేదా నిబంధనలకు విరుద్ధమైన ఆహార ఉత్పత్తులను వేగంగా గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఇది సహాయపడనుంది. ఈ వ్యవస్థలో భాగంగా, థర్డ్ పార్టీ ఏజెన్సీలు మార్కెట్‌ల నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరిస్తాయి. వాటిని ఆమోదం పొందిన ల్యాబ్‌లలో పరీక్షించి, ఫలితాలను నేషనల్ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఒకవేళ ప్రమాదకరమైన లేదా నిబంధనలకు అనుగుణంగా లేని ఆహార ఉత్పత్తులు గుర్తిస్తే, వెంటనే సంబంధిత రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులకు డిజిటల్ అలర్ట్స్ వెళ్తాయి. దీంతో కల్తీ ఆహారాన్ని మార్కెట్ నుంచి తక్కువ సమయంలో తొలగించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, పర్యవేక్షణ శాంపిల్స్‌లో కనీసం 50 శాతం పెద్ద పెద్ద సప్లై చెయిన్స్ నుంచి సేకరించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రతిపాదించింది. దీని ద్వారా పెద్ద బ్రాండ్లు, ఫుడ్ నెట్‌వర్క్‌లపై మరింత నిఘా ఉండనుంది.






