- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FSSAI: ‘హెల్తీ’ పేరుతో మోసం
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తూ 15 ఫుడ్ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆహార ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ‘హెల్తీ’ ట్యాగ్‌లు పెట్టి వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన వైఖరి అవలంబించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తూ 15 ఫుడ్ బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ఎమామి హెల్తీ అండ్ టేస్టీ, హెల్త్ ఎయిడ్, ట్రూవీ, ది హెల్తీ ఫ్యాక్టరీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, ప్లాన్ బి, న్యూహెర్బ్స్ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఉత్పత్తుల అసలు స్వభావానికి మించి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు భావన కలిగించే పేర్లు, ట్యాగ్‌లైన్లు, క్లెయిమ్‌లను ఉపయోగిస్తున్నారనే అభిప్రాయాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ వ్యక్తం చేసింది. ముఖ్యంగా ‘జీరో మైదా’ పేరుతో విక్రయిస్తున్న బ్రెడ్, పిజ్జా బేస్ ఉత్పత్తులు, ‘హెల్తీ’ అనే పదంతో మార్కెట్ చేస్తున్న స్నాక్స్, అలాగే అవసరమైన అనుమతులు లేకుండానే ‘ప్లాంట్ బేస్డ్ వీగన్’గా ప్రచారం చేసిన ఉత్పత్తులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. వినియోగదారులు ఉత్పత్తి గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకునేలా చేసే బ్రాండ్ పేర్లు, మార్కెటింగ్ క్లెయిమ్‌లు ఆహార భద్రతా నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ చర్యలతో భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల బ్రాండింగ్, లేబెలింగ్, హెల్త్ క్లెయిమ్‌ల విషయంలో మరింత పారదర్శకత పాటించాలని కంపెనీలకు హెచ్చరిక అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.






