FSSAI: సప్లిమెంట్లలో అశ్వగంధ ఆకుల వాడకంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధం

by S Gopi |

హెల్త్ సప్లిమెంట్లు, సంబంధిత ఉత్పత్తులలో అశ్వగంధ వేర్లు, వాటి సారాలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉందని ఎఫ్ఎస్ఎసేఐ స్పష్టం చేసింది.

FSSAI: సప్లిమెంట్లలో అశ్వగంధ ఆకుల వాడకంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల ఆరోగ్య ఉత్పత్తులలో అశ్వగంధ ఆకులు, వాటి సారాలు వాడకాన్ని నిషేధించింది. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ చర్యలు తీసుకుంది. హెల్త్ సప్లిమెంట్లు, సంబంధిత ఉత్పత్తులలో అశ్వగంధ వేర్లు, వాటి సారాలను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉందని ఎఫ్ఎస్ఎసేఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, అశ్వగంధ ఆకులలో అధిక స్థాయిలో రియాక్టివ్ విథానోలైడ్లు, ముఖ్యంగా విథాఫెరిన్-ఎ ఉంటాయి. ఇవి కాలేయానికి హాని, జీర్ణాశయ సంబంధిత సమస్యలు, నాడీ వ్యవస్థపై విష ప్రభావం చూపవచ్చు. ఈ క్రమంలోనే ఆకులు, వాటి సారాలను వాడకుండా నిషేధం విధించారు. 2026 నాటికి అశ్వగంధ మార్కెట్ విలువ 928.5 మిలియన్ డాలర్లు(రూ. 8,600 కోట్లు)గా ఉంటుందని అంచనా. కొంతమంది తయారీదారులు అనుమతి లేని అశ్వగంధ ఆకులను, వాటి సారాలను ఉపయోగిస్తున్నారని, కేవలం వేర్లు, వేర్ల సారాలను మాత్రమే ఉపయోగించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.

Next Story