- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LIC: ఎల్ఐసీ తదుపరి సీఈఓగా ఆర్ దొరైస్వామిని సిఫార్సు చేసిన ఎఫ్ఎస్ఐబీ
ఈ పదవికి నలుగురు అభ్యర్థులను సంప్రదించి, వారి పనితీరు, అనుభవంపై సమీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)కి కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ దొరైస్వామిని సిఫార్సు చేస్తున్నట్టు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) బుధవారం తెలిపింది. సంస్థ ఈ పదవికి నలుగురు అభ్యర్థులను సంప్రదించి, వారి పనితీరు, అనుభవం, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్ఐసీ తాత్కాలిక సీఈఓ, ఎండీగా ఉన్న సత్‌పాల్ భానూ స్థానంలో దొరైస్వామి నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ 8తో సత్‌పాల్ భాను నియమితులైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7 వరకు ఆయన బాధ్యతల్లో కొనసాగుతారు. ప్రస్తుతం ఎల్ఐసీలో ఎండీగా ఉన్న దొరైస్వామి ఆపరేషన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ, అకడమిక్ విభాగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. గతంలో, ఆయన 1999 నుంచి 2004 వరకు నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీకి రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేశారు.






