FPIs: భారీగా విదేశీ నిధులు వెనక్కి.. 2025లో ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు

by S Gopi |

ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కారణంగా ఉన్నాయి.

FPIs: భారీగా విదేశీ నిధులు వెనక్కి..  2025లో ఇప్పటివరకు రూ. 1.6 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో గత కొన్నాళ్లుగా వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. మధ్యలో ఒకటి రెండు సెషన్‌లలో లాభాలు వచ్చినా.. మెజారిటీ సెషన్లలో నష్టాలు వెంటాడాయి. ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కారణంగా ఉన్నాయి. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ నెలలో దేశీయ ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 23,885 కోట్ల విలువైన నిధులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు ఆగష్టులో రూ. 34,990 కోట్లను, జూలైలో రూ. 17,700 కోట్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ.1.58 లక్ష కోట్ల నిధులను వీరు ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వాణిజ్య, పాలసీ నిర్ణయాల కారణంగా గత నెల రోజులుగా ఎఫ్‌పీఐలు ఎక్కువ మొత్తం నిధులను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఇందులోనూ భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించడం, హెచ్-1బీ వీసా ఫీజును భారీగా పెంచడంతో ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీలో సెంటిమెంట్ దెబ్బతిన్నది. అందుకే ఎక్కువమంది విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్లాలని భావిస్తున్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Next Story