ఆగష్టులో రూ. 44 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన విదేశీ మదుపర్లు.!

by Disha Web Desk 16 |
ఆగష్టులో రూ. 44 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన విదేశీ మదుపర్లు.!
X

ముంబై: ఈ ఏడాది జూలై నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) భారత ఈక్విటీ మార్కెట్లలో తిరిగి పెట్టుబడులను ప్రారంభించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, డాలర్ విలువ తగ్గడం వంటి పరిణామాలే ఎఫ్ఐఐలు మళ్లీ మన మార్కెట్లలో పెట్టుబడులకు కారణం. ఆగష్టులోనూ ఈ ధోరణి వేగంగా ఉండటంతో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు రూ. 44,500 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. అంతకుముందు జూలైలో వచ్చిన రూ. 5 వేల కోట్ల కంటే ఇది చాలా ఎక్కువని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి.

2021, అక్టోబర్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు వరుసగా తొమ్మిది నెలల పాటు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్నారు. గణాంకాల ప్రకారం, గతేడాది అక్టోబర్ నుంచి 2022, జూన్ మధ్య మొత్తం రూ. 2.46 లక్షల కోట్ల విలువైన షేర్లను విదేశీ మదుపర్లు కొనుగోలు చేశారు. రానున్న నెలల్లో ఎఫ్ఐఐలు మరింత ఎక్కువగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణ పరిస్థితులు మెరుగు పడుతుండటం, సెంట్రల్ బ్యాంకుల కఠిన ద్రవ్య విధాన వైఖరి, త్రైమాసిక ఫలితాల్లో కంపెనీల ఆదాయం మెరుగ్గా ఉండటం వంటి పరిణామాలతో భారత ఈక్విటీలు విదేశీ పెట్టుబడులు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రిటైల్ విభాగం హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed