- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FPIs: పది రోజుల్లో రూ. 48 వేల కోట్ల ఎఫ్‌పీఐ అమ్మకాలు
దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ మదుపర్లు ఈ నెల మొదటి 10 రోజుల్లోనే మొత్తం రూ. 48,213 కోట్లు ఉపసంహరించుకున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల తరలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా దేశీయ ఈక్విటీల నుంచి విదేశీ మదుపర్లు ఈ నెల మొదటి 10 రోజుల్లోనే మొత్తం రూ. 48,213 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల రికార్డు స్థాయి నిధుల ఉపసంహరణ చేపట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్) డేటా ప్రకారం, ఏప్రిల్ అమ్మకాలతో 2026 నాటికి మొత్తం ఎఫ్‌పీఐ నిధుల తరలింపు సుమారు రూ. 1.8 లక్షల కోట్లకు పెరిగింది. ప్రపంచ ప్రతికూలతలు, పెరిగిన భౌగోళిక రాజకీయ రిస్క్‌ల వల్లే ఎఫ్‌పీఐల అమ్మకాలకు కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లలో రిస్క్ తగ్గిందని, ముడి చమురు ధరలు పెరగడం, ప్రపంచ ద్రవ్యోల్బణ ఆందోళనల ఎక్కువ ఒత్తిడి కలిగించాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.






