Apple: భారత్‌లోనే ఐఫోన్ 17 తయారీ ప్రారంభం

by S Gopi |

బెంగళూరులోని దేవనహళ్లిలో ఉన్న ప్లాంట్ చైనాలో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ తర్వాత రెండో అతిపెద్దది కావడం గమనార్హం.

Apple: భారత్‌లోనే ఐఫోన్ 17 తయారీ ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రండ్ ఐఫోన్ తన కొత్త 17 సిరీస్‌ల తయారీని భారత్‌లో ప్రారంభించింది. యాపిల్ ఉత్పత్తులకు సప్లయర్‌గా ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీ ఐఫోన్ 17లను బెంగళూరులోని తన రెండో అతిపెద్ద ప్లాంటులో తయారు చేస్తోంది. ఇప్పటికే చెన్నై యూనిట్‌లో జరుగుతున్న ఐఫోన్ 17 ఉత్పత్తికి ఇది అదనమని కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని దేవనహళ్లిలో ఉన్న ప్లాంట్ చైనాలో ఉన్న ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ తర్వాత రెండో అతిపెద్దది కావడం గమనార్హం. 2.8 బిలియన్ డాలర్ల(రూ. 22 వేల కోట్ల) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. యాపిల్ ఐఫోన్ ఉత్పత్తిని 2024-25లో దాదాపు 3.5-4 కోట్ల యూనిట్ల నుంచి ఈ సంవత్సరం 6 కోట్ల యూనిట్లకు పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఫాక్స్‌కాన్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తోంది. ఇటీవలి డేటా ప్రకారం, 2024-25తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ దాదాపు 22 బిలియన్ డాలర్ల(రూ. 1.93 లక్షల కోట్ల) విలువైన ఐఫోన్‌లను భారత్‌లో 60 శాతం అసెంబుల్ ప్రక్రియ చేపట్టింది. కంపెనీ ఆదాయ వివరాల ప్రకటన తర్వాత యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. 2025, జూన్ నెలకు సంబంధించి అమెరికాలో అమ్ముడైన ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారత్‌లో అసెంబుల్ చేసినవేనని వెల్లడించారు.

Next Story