- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
New India Cooperative Bank: వామ్మో...న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ కేసులో సంచలనం.. ఏకంగా 122 కోట్లు దోచేశారుగా
New India Cooperative Bank: మహారాష్ట్ర రాజధాని ముంబై లోని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకు(New India Cooperative Bank) కేసులో భారీ కుంభకోణం బట్టబయలు అయ్యింది.

దిశ, వెబ్‌డెస్క్: New India Cooperative Bank: మహారాష్ట్ర రాజధాని ముంబై లోని న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకు(New India Cooperative Bank) కేసులో భారీ కుంభకోణం బట్టబయలు అయ్యింది. ఈ కుంభకోణానికి పాల్పడింది బ్యాంకు మనేజరే అని తేలింది. న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్(New India Cooperative Bank) మాజీ జనరల్ మేనేజర్ బ్యాంకు ట్రెజరీ నుండి రూ.122 కోట్లు విత్ డ్రా చేసుకున్నారు. నిందితుడు మాజీ జనరల్ మేనేజర్ హితేష్ ప్రవీణ్‌చంద్ మెహతా(Hitesh Praveen Chand Mehta)గా గుర్తించారు.
హితేష్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా(Hitesh Praveen Chand Mehta) ఉన్నప్పుడు, దాదర్.. గోరేగావ్ శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. ఆ సమయంలో హితేష్ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. రెండు శాఖల ఖాతాల నుంచి రూ. 1.22 కోట్ల మోసానికి పాల్పడినట్లు వెల్లడయ్యింది. ఈ ఘటనపై దాదార్ పోలీస్ స్టేషన్(Dadar Police Station) లో బ్యాంకు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఫిర్యాదు(Bank Chief Accounts Officer's complaint) మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
కాగా ఈ స్కామ్‌లో హితేష్ తోపాటు మరో వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి దర్యాప్తు కోసం కేసును EOW కి బదిలీ చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఈ స్కామ్ 2020, 2025 మధ్య జరిగినట్లు గుర్తించారు. BNS సెక్షన్లు 316(5), 61(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేశారు దాదర్ పోలీసులు .
న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్(New India Cooperative Bank)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 6నెలల పాటు కొత్త లోన్స్ మంజూరు చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా ఆర్బిఐ(RBI) నిరోధించింది. అలాగే క్యాష్ విత్ డ్రాకు కూడా వీలు లేకుండా చేసింది. బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం, ద్రవ్యత స్థితి గురించి ఆందోళనల కారణంగా ఈ పరిమితులు అవసరమని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. డిపాజిటర్ల ఆర్థిక భద్రత ద్రుష్ట్యా ఆర్బిఐ ఈ చర్యలు తీసుకుంది. ముంబైకి చెందిన ఈ బ్యాంకులోని 1.3 లక్షల మంది డిపాజిటర్లలో 90 శాతం కంటే ఎక్కువ మంది ఖాతాల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నాయి.
కాగా ఈ కుంభకోణం బ్యాంక్ ఖాతాలను ఆడిట్ చేస్తున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ (RBI)గుర్తించింది. దీంతో బ్యాంక్ చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ (CCO)ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించారు. ఈ కుంభకోణంలో బ్యాంకులోని కొంతమంది ఉద్యోగులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఎంత మందికి ఇందులో ప్రమేయం ఉందన్న విషయాన్ని గుర్తించాల్సి ఉందని బ్యాంక్ చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ తెలిపారు.






