- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Forex Reserves: ఏడు నెలల కనిష్టానికి చేరుకున్న భారత ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికయ్యాక భారత ఫారెక్స్ రిజర్వ్(Forex Reserve) నిల్వలు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎన్నికయ్యాక భారత ఫారెక్స్ రిజర్వ్(Forex Reserve) నిల్వలు క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి. డిసెంబర్ 20తో ముగిసిన మూడో వారంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 8.5 బిలియన్ డాలర్ల మేర పతనమై 644.391 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఏడు నెలల కనిష్టస్థాయికి చేరుకున్నాయని, నెలలో ఒకవారం అత్యధికంగా పతనం కావడం ఇదే మొదటిసారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల అంతకముందు రెండు వారాల్లో 5.2 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. డాలర్ రేటు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వంటివి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. ఇక గోల్డ్ రిజర్వ్(Gold Reserves) నిల్వలు 2.33 బిలియన్ డాలర్లు పతనమై 65.726 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) 112 మిలియన్ డాలర్లు తగ్గి 17.885 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(IMF)లో భారత్ రిజర్వ్ నిల్వలు 23 మిలియన్ల డాలర్లు క్షీణించి 4.217 బిలియన్ డాలర్ల వద్ద నమోదైనట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.






