Gold Rate: లక్ష కాదు.. ఈ వారంలోనే రూ.1.50 లక్షలు దాటనున్న బంగారం ధర.. కొనడం కష్టమేనా?

by Vennela |   (  Updated:2025-04-22 06:52:10  IST  )

Gold Rate: బంగారం ధర హిస్టరీ క్రియేట్ చేసింది.

Gold Rate: లక్ష కాదు.. ఈ వారంలోనే రూ.1.50 లక్షలు దాటనున్న బంగారం ధర.. కొనడం కష్టమేనా?
X

దిశ, వెబ్ డెస్క్: Gold Rate: బంగారం ధర హిస్టరీ క్రియేట్ చేసింది. ఫిజికల్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1 లక్ష నమోదు అయ్యింది. దీని మీద 3శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలిపితే మొత్తం ధర రూ. 1,02,116 కి చేరుకుంది. ధర ఇంతలా పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి. బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడం అనేది ఫిజికల్ రూపంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. కానీ చాలా కాలంగా బంగారం ధర లక్ష రూపాయలు దాటడం ఖాయమని నిపుణులు అంచనా వేశారు. కానీ ఆ చారిత్రక సందర్భం నేడు సాకారం అయ్యింది. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టినవారికి ఇది లాభదాయకం అవుతుండగా.. ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ వార్త అంతగా రుచించదు. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరిగే కొద్దీ ఆభరణాలు కొనుగోలు చేయడం కష్టం అవుతుంది.

ఏప్రిల్ 21న సోమవారం సాయంత్రం బంగారం ధర కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే రిటైల్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,200గా నమోదు అయ్యింది. దీని మీద 3శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలిపితే మొత్తం ధర రూ. 1,02,116కి చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దీంతో బంగారం ప్రియులకు షాక్ కొట్టినట్లయ్యింది.

ఎంసీఎక్స్ జూన్ గోల్డ్ కాంట్రాక్ట్స్ కూడా అదే దిశగా ప్రయాణిస్తూ 10 గ్రాములకు గాను బంగారం ధర 97,288కి చేరింది. ఇది ఇప్పటి వరకు నమోదు అయిన అత్యధిక రికార్డు ధర ఇదే కావడం గమనార్హం. సాయంత్రం ఎంసిఎక్స్ లో బంగారం ధర రూ. 97,200 నమోదు అయ్యింది. గత గురువారం ముగిసిన ధర కంటే రూ. 1,946 లేదా 2.04శాతం పెరిగినట్లు గమనించవచ్చు.

నిజానికి గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం కమోడిటీ మార్కెట్లు మూసి ఉన్నాయి. దీంతో లాంగ్ వీకెండ్ అనంతరం నేరుగా సోమవారం ట్రేడ్ ప్రారంభమయ్యింది. నిజానికి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో 24క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 1,02,116 ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రకారం ఈ దేశీయ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర ప్రస్తుతానికి 3,407 డాలర్ల వద్ద ఉంది. ఇది ఒక్కరోజులోనే 80డాలర్లు పెరగడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 99మార్క్ దిగువకు పడిపోయింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. ఇదిలా ఉండగా గత నెలలో డాలర్ ఇండెక్స్ సుమారు 6శాతం వరకు పడిపోయింది. గత 3 నెలల్లో ఇది 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయింది.

అయితే మార్కెట్ వర్గాలు మాత్రం వారం, పది రోజుల్లోనే బంగారం ధర లక్షా 50వేలు రూపాయలు క్రాస్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారం చరిత్రను చూసినట్లయితే ఏనాడు కూడా తగ్గిన దాఖలాలు లేవు. 2013వ సంవత్సరంలో తులం బంగారం ధర 23వేల రూపాయలు ఉండగా.. కేవలం 10 సంవత్సరాల్లోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు 76 వేల రూపాయల వరకు పెరిగింది. అత్యధికంగా 2025వ సంవత్సరంలోనే పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Next Story