- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zomato: కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ విభాగంలో 600 మందిని తొలగించిన జొమాటో
వీరంతా ఉద్యోగాల్లోకి తీసుకున్న ఏడాదిలోపే తొలగింపులకు గురవడం గమనార్హం

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో భారీ సంఖ్యలో లేఆఫ్ ప్రకటించింది. కంపెనీకి చెందిన కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుగా ఉన్న దాదాపు 600 మందిని తొలగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. వీరంతా ఉద్యోగాల్లోకి తీసుకున్న ఏడాదిలోపే తొలగింపులకు గురవడం గమనార్హం. గతేడాది జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కింద కస్టమర్ సపోర్ట్ విభాగంలో నియామకాలు చేపట్టింది. కానీ, కస్టమర్ సర్వీస్ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ) వినియోగం పెరగడం కూడా ఈ తొలగింపులకు కారణంగా తెలుస్తోంది. ఈ లేఆఫ్ ప్రధానంగా హైదరాబాద్, గురుగ్రామ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపింది. అయితే, జొమాటో తాజా తొలగింపులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నిర్ణయం ఊహించలేదని, తమను తొలగించడానికి కారణాలను కూడా కంపెనీ చెప్పలేదని ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. కాగా, జొమటో గతేడాది జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కింద దాదాపు 1,500 మంది నియామకాలు చేపట్టింది. మొదట కస్టమర్ సపోర్ట్ విభాగంలో తీసుకున్న వీరిని ఆ తర్వాత ప్రమోషన్లు ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. కానీ, వారి నియామకాలకు సంబంధించి గడువు ముగిసే సమయానికి కాంట్రాక్టులను పునరుద్ధరించలేదని సమాచారం. ఇటీవలే జొమాటో కార్యకలాపాల నిర్వహణ కోసం ఏఐతో పనిచేసే కస్టమర్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్ నగెట్‌ను ప్రారంభించింది. ఈ ఏఐ జొమాటోతో పాటు కంపెనీ అనుబంధ బ్లింక్ఇట్, హైపర్‌ప్యూర్ కోసం కస్టమర్ సర్వీసులను నిర్వహిస్తుంది.






