Finance Ministry: హల్వా వేడుకలో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలమ్మ

by S Gopi |   (  Updated:2026-01-27 15:38:04  IST  )

ఈ వేడుకలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయమంత్రి పంకజ్ చౌదరీ, ఆర్థిక శాఖలోని పలు విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపొందించడంలో భాగస్వామ్యం ఉన్న అధికారులు పాల్గొన్నారు.

Finance Ministry: హల్వా వేడుకలో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో మూడు రోజుల్లో కేంద్ర బడ్జెట్ వెలువడనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు సాంప్రదాయ 'హల్వా' వేడుకలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న 2026-27 కేంద్ర బడ్జెట్ తయారీకి ఇది చివరి దశను సూచిస్తుంది. కర్తవ్య భవన్-ఈలోని కొత్త ప్రాంగణంలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ పాత కార్యాలయం రాయ్‌సినా హిల్‌లోని నార్త్ బ్లాక్‌లో ఈ వేడుక జరిగింది. ఆర్థిక మంత్రి, ఆమె బృందంలోని చాలా మందిని గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్‌లో ఉన్న కొత్త కేంద్ర సచివాలయ కార్యాలయానికి మారిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయమంత్రి పంకజ్ చౌదరీ, ఆర్థిక శాఖలోని పలు విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపొందించడంలో భాగస్వామ్యం ఉన్న అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత బడ్జెట్ ప్రెస్‌ను పరిశీలించిన ఆర్థిక మంత్రి, ప్రింటింగ్ ఎర్పాట్లను పరిశీలించారు.

లాక్‌-ఇన్​పీరియడ్ అధికారులు

హల్వా వేడుక అంటే బడ్జెట్ లాక్-ఇన్​పీరియడ్. ఈ ప్రక్రియ బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌లో వార్షిక పద్దును ప్రవేశపెట్టేవరకు ఆ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. బడ్జెట్ ప్రకటన ముగిసేంతవరకు ఎవ్వరూ బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండదు. అందరూ సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలో ఉంటారు. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత వారందరూ బయటకు వస్తారు. ఐదురోజులపాటు వారు నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. 1950లో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో లీక్ అయిన ఘటన కారణంగా ఈ లాక్‌-ఇన్‌ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు.

READ MORE ....

Nirmala Sitaraman: వరుసగా 9వ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ రికార్డు

Next Story