Royal Enfield: బెంగళూరులో ఫ్లయింగ్ ఫ్లీ తొలి స్టోర్ ప్రారంభం

by S Gopi |

ఈ కొత్త మోటార్​సైకిల్​ను రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రత్యేక 'ఫ్లయింగ్ ఫ్లీ' స్టోర్ల నుంచి మాత్రమే విక్రయిస్తుంది.

Royal Enfield: బెంగళూరులో ఫ్లయింగ్ ఫ్లీ తొలి స్టోర్ ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ పేరుతో ఈవీ విభాగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బెంగళూరులో కంపెనీ తన తొలి ఈవీ స్టోర్‌ను ప్రారంభించింది. సంస్థ 125వ వార్షికోత్సవం సందర్భంగా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నామని ఐషర్ మోటార్స్ ఎండీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి గోవిందరాజన్ తెలిపారు. ఈ కొత్త మోటార్​సైకిల్​ను రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రత్యేక 'ఫ్లయింగ్ ఫ్లీ' స్టోర్ల నుంచి మాత్రమే విక్రయిస్తుంది. ఈ షోరూమ్ నుంచి ఫ్లయింగ్ ఫీల్ మోటార్​సైకిల్ డెలివరీలు మే నెలలో ప్రారంభమవుతాయి. అనంతరం దశలవారీగా ఇతర నగరాల్లోనూ ఫ్లయింగ్ ఫ్లీ స్టోర్లను విస్తరించనున్నట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ విభాగంలో ఫ్లయింగ్ ఫ్లీ సీ6తో పాటు భవిష్యత్తులో మరిన్ని ఆకర్షణీయమైన ఈవీ టూవీలర్లను తీసుకొస్తామని, కంపెనీ విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని గోవిందరాజన్ అన్నారు. కొత్త రైడర్లు ఇష్టపడేలా, బైక్ నడపడానికి అనువుగా, అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండేలా కొత్త ఈవీలు రూపొందిస్తామని రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఫ్లయింగ్ ఫ్లీ, ఈవీ ప్రొడక్ట్ స్ట్రాటజీ హెడ్ మాట్ కార్డెనాస్ వెల్లడించారు.

Next Story