- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flipkart: రిపబ్లిక్ డే సేల్ తేదీలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాది మొదటి సేల్‌ను ప్రకటించింది. దేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'రిపబ్లిక్ డే సేల్' పేరుతో ఈ సేల్‌ను ప్రారంభించగా, గురువారం దానికి సంబంధించిన తేదీలను వెల్లడించింది. జనవరి 17 నుంచి మొదలుకానున్న ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు మరియు టాబ్లెట్‌లు వంటి ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు తక్కువ ధరకు లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, సులభ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి. ఇతర ఎంపిక చేసిన బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులతో వినియోగదారులు 15 శాతం వరకు తక్షణ రాయితీలను కూడా పొందుతారు. కంపెనీ కీలక సబ్‌స్క్రిప్షన్ ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ కస్టమర్లకు ప్రత్యేక డీల్స్, ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ ఈవెంట్‌లో రష్ అవర్ డీల్స్, టిక్ టాక్ డీల్స్, జాక్‌పాట్ డీల్స్, స్టీల్ డీల్స్ లాంటి స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని కంపెనీ వివరించింది.






