ఇక నుంచి Flipkart ద్వారా హోటల్ బుకింగ్

by Disha Web Desk 17 |
Flipkart to Partner with Pocket FM to Enter Audiobooks Category
X

న్యూఢిల్లీ: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ఆతిథ్య రంగంలోకి అడుగుపెడుతున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా మంగళవారం ప్రయాణ రంగంలో ఆఫర్లను అందించేందుకు ప్లాట్‌ఫామ్‌లో కొత్తగా హోటల్-బుకింగ్ ఫీచర్ - ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌ను - ప్రారంభించింది. కొత్తగా మొదలైన ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మొత్తం 3 లక్షల దేశీయంగా, అంతర్జాతీయ హోటళ్లలో గదులను బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్లియర్‌ట్రిప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ మద్దతుతో ఫ్లిప్‌కార్ట్ ఈ ఫీచర్ ద్వారా సేవలందించనుంది.

ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఫ్లిప్‌కార్ట్ హోటల్స్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. దీనివల్ల వినియోగదారులకు సరసమైన ధరలో హోటల్ బస సౌకర్యం లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ అన్నారు. ఫ్లిప్‌కార్ట్ హోటల్స్ ద్వారా మెట్రో, ఇతర పట్టణాల్లోని తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించే తమ నిబద్దత మరింత పటిష్టంగా ఉంటుంది. బ్యాంకింగ్ భాగస్వాములతో కలిసి ఆఫర్లను అందించడం ద్వారా ఈ విభాగంలో కస్టమర్లకు ప్రయోజనాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.


Next Story