- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flipkart: మరో ఫెస్టివల్ సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. ధమాకా సేల్‌లో రూ. 90 వేలకే ఐఫోన్ 16 ప్రో
సేల్‌లో భాగంగా ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్‌ను కూడా అందిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పండుగ సీజన్ కోసం మరో భారీ సేల్‌ను ప్రకటించింది. ఇప్పటికే దసరా సందర్భంగా తీసుకొచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అక్టోబర్ 2తో ముగియడంతో కొత్తగా సేల్‌ను తీసుకొచ్చింది. 'బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్'తో పేరుతో తెచ్చిన ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ఇస్తున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 4 అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదాలయ్యే ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (స్నాప్‌డ్రాగన్) సహా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా కస్టమర్లు అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఐఫోన్ 16 రూ. 56,999కి విక్రయిస్తోంది. ఐఫోన్ 16 ప్రోను రూ. 85,999 ధరకే అందిస్తోంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 1,04,999కి ఆఫర్ చేస్తోంది. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుత ధర రూ. 25,999 ఉంటే రూ. 18,999కి లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 (స్నాప్‌డ్రాగన్)ను రూ. 38,999 ధరకే అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. శనివారం నుంచి ప్రారంభమయ్యే 'బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్' అక్టోబర్ 8 వరకు కొనసాగనుంది.






