- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flipkart: ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
2026 చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తామని కంపెనీ స్పష్టం చేసింది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రెండేళ్ల క్రితం మినిట్స్ ద్వారా క్విక్ కామర్స్ విభాగంలోకి ప్రవేశించిన కంపెనీ, తాజాగా ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించింది. వాల్‌మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది మే లేదా జూన్ మధ్య పైలట్ ప్రాజెక్ట్‌గా లాంచ్ చేయాలని భావిస్తోంది. తొలుత బెంగళూరు కేంద్రంగా దీన్ని చేపట్టనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే 2026 చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాపారంలో జొమాటో, స్విగ్గీ కంపెనీలు ఆధిపత్యం సాగిస్తున్నాయి. పలు కంపెనీలు ప్రయత్నాలు చేసినప్పటికీ నిలదొక్కుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ప్రకటన జొమాటో, స్విగ్గీ కంపెనీల షేర్లపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా గురువారం ట్రేడింగ్‌లో జొమాటో షేర్ ధర 1 శాతానికి పైగా క్షీణించి రూ. 297.40కి, స్విగ్గీ కూడా 1 శాతం పైన పడిపోయి రూ. 338.60కి చేరింది.
ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీలోకి రావాలని ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు రెండేళ్ల క్రితం, ప్రభుత్వ మద్దతు ఉన్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) ద్వారా ఫుడ్ డెలివరీలోకి ప్రవేశించాలని భావించింది. అయితే, ఆ ప్రయత్నాలు ప్రారంభ చర్చలను దాటి ముందుకు సాగలేదు. దేశ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ప్రస్తుతం సుమారు రూ. 81.5 వేల కోట్లకు పైనే ఉంది. 2030 నాటికి ఇది దాదాపు రూ. 2.26 లక్షల కోట్లకు పెరుగుతుందని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది.






