- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flipkart: ఏడాది యూట్యూబ్ ప్రీమియంతో 'ఫ్లిప్‌కార్ట్ బ్లాక్' మెంబర్‌షిప్
ఈ ప్రోగ్రామ్ థర్డ్-పార్టీ సేవలతో సహా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం సరికొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. 'ఫ్లిప్‌కార్ట్ బ్లాక్' పేరుతో ప్రారంభించిన ఈ సేవలను తీసుకున్న వారికి ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు సేల్ ఈవెంట్ల సమయంలో ముందుగా యాక్సెస్ పొందవచ్చని, ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్ థర్డ్-పార్టీ సేవలతో సహా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్, యూట్యూబ్ మ్యూజిక్‌తో సహా ఏడాది పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్‌షిప్ లాంటి ప్లాన్‌లను అందిస్తున్నప్పటికీ, కొత్తగా తెచ్చిన ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ను మరింత ప్రీమియం సౌకర్యాలతో ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌ను ఎంచుకునేందుకు రూ. 1,499 వార్షిక ఫీజును నిర్ణయించింది. అయితే, పరిమితకాలానికి ఆఫర్ కింద రూ. 990కే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ మెంబర్షిప్ తీసుకున్న వారికి ప్రతి ఆర్డర్‌పైనా గరిష్ఠంగా రూ. 100 వరకు 5 శాతం సూపర్ కాయిన్స్ క్యాష్‌బ్యాక్, నెలకు గరిష్ఠంగా 800 సూపర్ కాయిన్స్ లభిస్తాయి. సూపర్ కాయిన్స్ ఉపయోగించి చేసే చెల్లింపులపై రూ. 1,000 వరకు 5 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ వివరించింది.






