షాపింగ్ ప్రియులకు శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ వచ్చేసింది

by Dishafeatures2 |
షాపింగ్ ప్రియులకు శుభవార్త.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ వచ్చేసింది
X

దిశ, వెబ్‌డెస్క్: షాపింగ్ ప్రేక్షకులకు తీపికబురు అందింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ నిర్వహించే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ రాబోతుంది. పండుగల సీజన్ వస్తుండటంతో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రవేశట్టాలని ఫ్లిప్‌కార్ట్ నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 8 నుంచి 15వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా బిగ్గెస్ట్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టనుంది.

మొబైల్స్, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు ఇంట్లో ఉపయోగించే ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్లు, టీవీలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రవేశపెట్టనుంది. టీవీ, హోమ్ అప్లయెన్స్‌పై 80 శాతం, ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్‌పై 50 నుంచి 80 శాతం, ఫ్యాషన్, స్పోర్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అలాగే మార్కెట్‌లోకి కొత్తగా విడుదలయ్యే వివో, మోటోరోలా, శాంసంగ్ ఫోన్లను సేల్‌కు ఉంచనుండగా.. వీటితో పాటు ఐఫోన్స్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్ ఇవ్వనుంది. దీంతో షాపింగ్ ప్రియులు ఈ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రతీ ఏడాది దసరా సమయంలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెడుతుంది. దీని ద్వారా అన్ని వస్తువులపై భారీ తగ్గింపు ప్రకటిస్తూ ఉంటుంది. దీంతో ఈ సేల్ కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే కస్టమర్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ సేల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు. ఇక ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా అమెజాన్ కూడా ప్రత్యేక సేల్‌ను త్వరలో తీసుకురానుంది.



Next Story

Most Viewed