మరోసారి భారీ తగ్గింపులతో Flipkart దీపావళి సేల్.. ఈ తేదీన మొదలు..

by Disha Web Desk 17 |
మరోసారి భారీ తగ్గింపులతో Flipkart దీపావళి సేల్.. ఈ తేదీన మొదలు..
X

హైదరాబాద్: ఈ కామర్స్ సైట్లు పండగ సీజన్‌ వచ్చిందంటే చాలు భారీ తగ్గింపులు, డిస్కౌంట్లతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తాయి. ఇప్పటికే దసరా పండగకు ప్రత్యేక తగ్గింపు సేల్‌ను తెచ్చిన ఫ్లిప్‌కార్ట్ తరువాత రాబోయే దీపావళి పండగను పురస్కరించుకుని ‘బిగ్ దివాళి’ సేల్‌ను ప్రకటించింది. ఇది నవంబర్ 2 నుంచి 11 వరకు జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఈ సేల్ ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 1 నుంచి మొదలవుతుంది.

కొనుగోలు సమయంలో SBI క్రెడిట్ కార్డ్‌లు, EMI ల కనీస లావాదేవీ రూ.5000 లపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంది. Paytm పై 10శాతం క్యాష్‌బ్యాక్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు, హెడ్‌ఫోన్స్, దుస్తులు, బ్యూటీకేర్ ఉత్పత్తులు, ఇంటికి అవసరమైన పలు రకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.



Next Story

Most Viewed