బీమా చట్టంలో మార్పులు చేసే యోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ!

by Disha Web Desk 22 |
బీమా చట్టంలో మార్పులు చేసే యోచనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ!
X

న్యూఢిల్లీ: దేశీయ బీమా పరిశ్రమ వృద్ధికి మద్దతిచ్చేందుకు బీమా చట్టాల్లో మార్పులు తీసుకురావాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కనీస మూలధన తగ్గింపుతో పాటు మరికొన్ని ఉన్నాయి. భారత ఇన్సూరెన్స్ పరిశ్రమ 2019-20 లో 3.76 శాతం నుంచి 2020-21 నాటికి 4.20 శాతానికి పెరిగింది. ప్రతి ఏటా పరిశ్రమ గణనీయమైన వృద్ధిని చూస్తున్న నేపథ్యంలో బీమా చట్టం-1938ని సమగ్రంగా సమీక్షించి, ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి మంత్రిత్వ శాఖ తగిన మార్పులను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బీమా వ్యాపారాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం మూలధనం రూ. 100 తగ్గించడం అనే నిబంధనలో ఇందులో ఒకటి. మూలధన అవసరాన్ని సడలించడం వల్ల స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనివర్సల్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్ వంటి విభాగల్లోని బ్యాంకింగ్ రంగ కంపెనీలు బీమా పరిశ్రమలో అడుగు పెట్టవచ్చు.

ఎక్కువ కంపెనీలు ఈ రంగంలో ప్రవేశించం మూలంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కాగా, బీమా సంస్థల్లో విదేశీ పెట్టుబడులు 49 శాతం నుంచి 74 శాతానికి పెంచేందుకు గతేడాది ప్రభుత్వం బీమా చట్టంలో సవరణ తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, ఈసీజీసీ వంటి 24 లైఫ్ ఇన్సూరెన్స్ బీమా కంపెనీలు, 31 నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. 2020-21లో లైఫ్, నాన్-లైఫ్ బీమా సంస్థలు రూ. 8.2 లక్షల కోట్ల ప్రీమియం వసూళ్లను నమోదు చేశాయి.


Next Story

Most Viewed