- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zenzo: 15 నిమిషాల్లో ఆంబులెన్స్ సేవలు ప్రారంభించిన జెన్జో
దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఛార్జీలను అమలు చేస్తామని, ఒకే టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ ప్రొవైడర్ కంపెనీ జెన్జో సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యాబ్ సేవల మాదిరిగా కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఆంబులెన్స్ సదుపాయం అందించనున్నారు. దీనికోసం 450 నగరాల్లో 25,000 ప్రైవేట్ అంబులెన్స్‌లను కంపెనీ ప్రారంభించింది. అత్యవసరంగా స్పందించేలా, ప్రథమ చికిత్స, సీపీఆర్ అందించేందుకు వీలుగా జొమాటోతో పాటు ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని జెన్జో అధికారిక ప్రకటనలో వెల్లడించింది. డెలివరీ సేవలందించే సిబ్బంది తక్షణం స్పందిస్తుంటారని, ఈ కారణంగానే వారికి ప్రాణాలను కాపాడే పధతులపై అవగాహన కల్పించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. వీటిలో బేసిక్ ఆంబులెన్స్‌లతో పాటు కార్డియాక్ (అధునాతన) అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ సీఈఓ శ్వేత మంగల్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఛార్జీలను అమలు చేస్తామని, ఒకే టోల్‌ఫ్రీ నంబర్(1800 102 1298) అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. బేసి ఆంబులెన్స్‌ల కోసం మొదటి 5 కిలోమీటర్లకు రూ. 1,500 ఛార్జీ అమలు చేస్తున్నామని, ఆపైన ఒక్కో కిలోమీటర్‌కు రూ. 50 చొప్పున వసూలు చేస్తున్నట్టు చెప్పారు. కార్డియాక్ ఆంబులెన్స్‌లకు మొదటి 5 కిలోమీటర్లకు రూ. 2,500, ఆపైన ఒక్కో కిలోమీటర్‌కు రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మరింత మెరుగ్గా అందించేందుకు ఆసుపత్రులతో పాటు స్థానిక అధికారులు, ప్రైవేట్ ఆంబులెన్స్‌లతో కలిసి పనిచేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.






