- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Festival Season: పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డులదే హవా
చాలామంది క్రెడిట్ కార్డు కస్టమర్లు ఎక్కువ కొనుగోళ్లు జరిపారని ప్రముఖ డిజిటల్ మార్కెట్‌ప్లేస్ పైసాబజార్ సర్వేలో తేలింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది పండుగ సీజన్‌కు కొనుగోళ్లలో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా దీపావళి సందర్భంగా చాలామంది క్రెడిట్ కార్డు కస్టమర్లు ఎక్కువ కొనుగోళ్లు జరిపారని ప్రముఖ డిజిటల్ మార్కెట్‌ప్లేస్ పైసాబజార్ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఈ-కామర్స్ కంపెనీలు అందించిన సేల్స్, ఆఫర్ల కారణంగా 42 శాతం క్రెడిట్ కార్డు కస్టమర్లు రూ. 50,000కు పైగా ఖర్చు చేశారు. మరో 22 శాతం మంది రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు కొనుగోళ్లు నిర్వహించారని సర్వేలో తెలిపింది. ఈ కొనుగోళ్లలో క్రెడిట్ కార్డు ఆఫర్ల అత్యధికంగా ఉన్నాయి. 91 శాతం మంది క్రెడిట్ కార్డు ఆఫర్‌ల చుట్టూ జరిగాయి. 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే డిస్కౌంట్‌లు లేదా క్యాష్‌బ్యాక్ కోసం చూడకుండా షాపింగ్ చేశామని చెప్పారు. 13 శాతం మంది క్రెడిట్ కార్డు నుంచి రూ. 10,000 కంటే తక్కువ షాపింగ్ చేశారు. 21 శాతం మంది రూ. 10-25 వేలు, 24 శాతం మంది రూ. 25-50 వేలు, 22 శాతం మంది రూ. 50 వేల నుంచి రూ. లక్ష మధ్య షాపింగ్ చేశారు. రూ. లక్ష కంటే ఎక్కువ షాపింగ్ క్రెడిట్ కార్డు ద్వారా చేసినవారు 20 శాతం మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా గృహోపకరణాలు (25 శాతం), మొబైల్స్, గాడ్జెట్‌లు, ఇతర ఉత్పత్తులు (23 శాతం), దుస్తులు (22 శాతం) కొనేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగించారు.






