మళ్లీ యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by Malleboina Mahesh |

పశ్చిమాసియాలో పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ మార్కెట్లు పతనమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 724 పాయింట్లు, నిఫ్టీ 222 పాయింట్లు కుప్పకూలాయి.

మళ్లీ యుద్ధ భయాలు.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో మళ్లీ ముదురుతున్న యుద్ధ పరిస్థితులు ముదురుతున్నాయి. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను వణికించడంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లను భారీ పతనం లోకి నెట్టాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోవడంతో సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దలాల్ స్ట్రీట్ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ ప్రారంభంలోనే ఏకంగా 724.95 పాయింట్లు క్షీణించి 73,518.39 మార్కుకు పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 222.45 పాయింట్లు కోల్పోయి 23,138.60 వద్ద ట్రేడవుతోంది.

యుద్ధ భయాల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా దూసుకుపోవడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది. అమెరికా మార్కెట్లలో ఐటీ రంగానికి చెందిన నాస్‌డాక్ సూచీ 4% పైగా పడిపోవడం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దేశీయ మార్కెట్లలో ఐటీ, మెటల్స్, ఆటో, రియల్టీ వంటి కీలక రంగాల్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో విప్రో, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ వంటి దిగ్గజ షేర్లు పతనం బాట పట్టాయి.

Next Story