Nayara Energy: 2021 తర్వాత మొదటిసారి భారత్ నుంచి చైనాకు డీజిల్ రవాణా

by S Gopi |

అందులో భాగంగానే చమురు ఉత్పత్తి ఎగుమతుల్లో అనిశ్చితి అధిగమించేందుకు చైనాను ఎందుకుంది.

Nayara Energy: 2021 తర్వాత మొదటిసారి భారత్ నుంచి చైనాకు డీజిల్ రవాణా
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరు కారణంగా ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ట్రంప్ చర్యలకు భారత్, చైనా మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్(ఈయూ) రష్యా చమురును కొనుగోలు చేయడంపై సుంకం, జరిమానా విధించడంతో మన దేశంలో ఉన్న నయారా ఎనర్జీ ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తోంది. అందులో భాగంగానే చమురు ఉత్పత్తి ఎగుమతుల్లో అనిశ్చితి అధిగమించేందుకు చైనాను ఎందుకుంది. దీంతో 2021 తర్వాత తొలిసారి నయారా ఎనర్జీ తన చమురు సరఫరాను చైనాకు పంపింది. కేప్లర్ నివేదిక ప్రకారం, జూలై 18న నయారాలోని వాడినార్ టెర్మినల్ నుంచి ఈఎం జెనిత్ అనే నౌక సుమారు 4,96,000 బ్యారెళ్ల అల్ట్రా-లో సల్ఫర్ డీజిల్‌ను తీసుకెళ్లింది. ఈ డీజిల్ మలేషియా వెళ్లాల్సి ఉండగా, ఈయూ విధించిన ఆంక్షల కారణంగా మలక్కా జలసంధిలో తన మార్గాన్ని మార్చి దాదాపు 12 రోజులు లంగరు వేసింది. అనంతరం చైనాలోని జౌషాన్ రేవు వైపుగా మళ్లించినట్టు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

చిక్కుల్లో నయారా ఎనర్జీ

ఇటీవలి ఈయూ ఆంక్షల వల్ల నయారా ఎనర్జీ చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరుకులను లోడ్ చేయడానికి ముందస్తు చెల్లింపులు లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని కోరుతోంది. దీనికి తోడు ముడి చమురు డెలివరీలలో అంతరాయాల కారణంగా కంపెనీ తన వాడినార్ శుద్ధి కర్మాగారంలో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. నయారీ ఎనర్జీలో రష్యా పెట్రోలియం దిగ్గజం రోస్‌నెఫ్ట్‌కు 49 శాతం వాటా ఉంది. అమెరికా సహా యూరప్ దేశాల ఆంక్షలతో ఇప్పటికే నయారీ ఎనర్జీకి మైక్రోసాఫ్ట్ సంస్థ డేటా సేవలను నిలిపేసిది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ సైతం కంపెనీకి సేవలందించడంలేదు.

Next Story