- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Exports: ఫిబ్రవరిలో తగ్గిన ఎగుమతులు
ఫలితంగా సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్ల(రూ. 2.50 లక్షల కోట్ల)కు చేరుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వస్తువుల ఎగుమతులు స్వల్పంగా 0.81 శాతం తగ్గి 36.61 బిలియన్ డాలర్ల(రూ. 3.38 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఇదే నెలలో దిగుమతులు 24.11 శాతం పెరిగి 63.71 బిలియన్ డాలర్ల(రూ. 5.88 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఫలితంగా సమీక్షించిన నెలలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్ల(రూ. 2.50 లక్షల కోట్ల)కు చేరుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది గతేడాది నమోదైన 14 బిలియన్ డాలర్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ దేశ ఎగుమతులు మెరుగ్గా కొనసాగుతున్నాయని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. అయితే, బంగారం, వెండి డిమాండ్ కారణంగా దిగుమతులు 24 శాతం పెరిగాయని వాణిజ్య శాఖ తెలిపింది. ఈ నెలలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, కీలక హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలతో మార్చి గణాంకాలు ప్రభావితం అవుతాయని, లాజిస్టిక్స్ ఖర్చులను పెంచుతాయని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు.






