డిసెంబర్ త్రైమాసికంలో 29 శాతం పెరిగిన ఈవీ అమ్మకాలు!

by Disha Web Desk 17 |
డిసెంబర్ త్రైమాసికంలో 29 శాతం పెరిగిన ఈవీ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: గత ఏడాది చివరి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని ఓ నివేదిక వెల్లడించింది. ప్రముఖ జేఎంకే రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాలు త్రైమాసిక ప్రాతిపదికన 3,57,248 యూనిట్లతో 28.86 శాతం వృద్ధి చెందాయి. వీటిలో అత్యధిక భాగం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలేనని నివేదిక తెలిపింది.

ఈ త్రైమాసికంలో ఈవీ ద్విచక్ర వాహనాలు మొత్తం అమ్మకాల్లో 65.13 శాతం వాటాను కలిగి ఉండగా, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్(కార్గొ, ప్యాసింజర్ కలిపి) 30.32 శాతం వాటా విక్రయాలను సాధించాయి. సమీక్షించిన త్రైమాసికంలో ఈవీ మార్కెట్లోకి కొత్తగా 9 ద్విచక్ర వాహనాలు, ఆరు త్రీ-వీలర్ మోడళ్లు, ఐదు ఈవీ కార్లు వచ్చాయని నివేదిక వెల్లడించింది.

అదే సమయంలో దేశవ్యాప్తంగా మొత్తం 26 వేల కొత్త ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయి. అత్యధికంగా ఈవీలను విక్రయించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 14.33 శాతం, మహారాష్ట్ర 13.78 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.


Next Story

Most Viewed