EV Sales: 24.52 లక్షల ఈవీ అమ్మకాలు

by S Gopi |

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 24.52 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని ఫాడా మంగళవారం ప్రకటనలో తెలిపింది.

EV Sales: 24.52 లక్షల ఈవీ అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 24.52 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కంటే 24.6 శాతం ఎక్కువని పేర్కొంది. ప్యాసింజర్, టూ-వీలర్‌తో అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదవడం గమనార్హం. టూ-వీలర్ ఈవీ విభాగం 14 లక్షల యూనిట్ల మార్కును అధిగమించి 21.81 శాతం పెరగ్గా, ఈవీ ప్యాసింజర్ విభాగం 2 లక్షల యూనిట్ల మార్కుకు చేరువలో నిలిచింది. అయితే, 1,99,923 యూనిట్ల విక్రయాలతో ఏకంగా 83.63 శాతం వృద్ధిని సాధించింది. కమర్షియల్ ఈవీ విభాగంలో అమ్మకాలు 19,454 యూనిట్లతో ఏకంగా 120.57 శాతం వృద్ధి నమోదవడం విశేషం. ఈ డేటా అమ్మకాల పెరుగుదల కంటే దేశంలోని ప్రజలు టూ-వీలర్, కారు, ఆటో ఇలా అన్ని విభాగాల్లో ఈవీలకు మారడం కొత్త మార్పును సూచిస్తుందని ఫాడా అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ అన్నారు.

Next Story