- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ePlane Company : దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ తీసుకురానున్న ఈప్లేన్ కంపెనీ
ఈ భాగస్వామ్యంలో ఆర్థిక పరమైన అంశాలు ఉండవని, పూర్తిగా మేధో సహకారంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (ఈవీటోల్) విమానాలను దేశీయంగా అభివృద్ధి చేసిన ఈప్లేన్ కంపెనీ గ్లోబల్ టెక్ దిగ్గజం ఎన్విడియాతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా దేశీయ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ఈ200ఎక్స్‌ను నిర్మించడానికి ఎన్విడియాతో కలిసి పనిచేసినట్లు గురువారం ప్రకటనలో తెలిపింది. ఈ భాగస్వామ్యంలో ఆర్థిక పరమైన అంశాలు ఉండవని, పూర్తిగా మేధో సహకారంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఈప్లేన్ ఈ200ఎక్స్ విమానాల తయారీలో డిజిటల్ ట్విన్ అంటే ఈ విభాగం డిజిటల్ కాపీని సృష్టించడానికి ఎన్విడియా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. ఈ వర్చువల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కంప్యూటర్‌లో పరీక్షిస్తారు. ఇది సెన్సార్ ఫెయిల్యూర్, ఢీకొనే ప్రమాదాలను డిజిటల్‌గా టెస్ట్ చేస్తారు. దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాకుండా రిస్క్‌ను తగ్గిస్తుంది. ఎన్విడియా ఈప్లేన్ సురక్షితంగా ఎగరడానికి అవసరమైన ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది. నిజ జీవితంలో ఈ పరీక్షలు నిర్వహించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, పైగా రిస్క్ ఎక్కువ. సమయం కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. అందుకే కంపెనీ ఈ విధమైన వర్చువల్ టెస్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల విమానాన్ని లక్షల కిలోమీటర్లు వర్చువల్‌గా ఎగరేలా చేయవచ్చు. సిమ్యులేషన్‌లను ఉపయోగించి విమాన సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తారు.






