EPFO వడ్డీ రేట్లు ఖరారు

by Muthe.Rajitha |

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి(EPF) వడ్డీ రేటును 8.5%గా ఖరారు చేసింది.

EPFO వడ్డీ రేట్లు ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి(EPF) వడ్డీ రేటును 8.5%గా ఖరారు చేసింది. దీనిని EPFO యొక్క కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) సిఫారసు చేయగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024 మే 31న గెజిట్‌లో ప్రకటించనుంది. దీంతో 7 కోట్లకు పైగా చందాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వడ్డీ నెలవారీ బ్యాలెన్స్‌పై 0.688% రేటుతో లెక్కించి వారి ఖాతాల్లో జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. కాగా UMANG యాప్, EPFO పోర్టల్, మిస్డ్ కాల్ ద్వారా చందాదారులు తమ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు.

Next Story