- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Starlink: స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ప్రారంభించేందుకు అన్నీ సిద్ధం: జ్యోతిరాదిత్య సింధియా
దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు, నెట్‌వర్క్ వాడకానికి కావాల్సిన ఫ్రేమ్‌వర్క్‌లు సిద్ధం

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ భారత్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి యూనిఫైట్ లైసెన్స్‌ను పొందింది, స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం అవసరమైన ఫ్రేమ్‌వర్క్ కూడా ఇప్పటికే అమలులో ఉందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం తెలిపారు. దేశంలో మొట్టమొదటి సెల్యూలార్ కాల్ చేసి 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి తాజా ప్రకటన చేశారు. దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపు, నెట్‌వర్క్ వాడకానికి కావాల్సిన ఫ్రేమ్‌వర్క్‌లు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో సజావుగా సేవలు అమలవుతాయని సింధియా అన్నారు. స్టార్‌లింక్‌తో పాటు, భారతీ గ్రూప్-మద్దతుగల యూటెల్‌సాట్ వన్‌వెబ్, జియో ఎస్ఈఎస్ కూడా తమ శాట్‌కామ్ సేవలను ప్రారంభించడానికి స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచి ఉన్నాయని తెలిపారు. గత 11 ఏళ్లలో భారత్ డిజిటల్ వృద్ధిని అత్యంత వేగంగా సాధించింది. మారుమూల గ్రామాల మొదలుకొని రద్దీగా ఉండే నగరాల వరకు అందరికీ డిజిటల్ యాక్సెస్ లభించింది. సరసమైన, వేగవంతమైన సాంకేతికతలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 120 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. ఇంటర్నెట్ యూజర్లు 286 శాతం పెరిగి 97 కోట్లకు చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వినియోగం ఏకంగా 1,450 శాతం పెరిగింది. 2014లో 6 కోట్ల నుంచి 94.4 కోట్లకు చేరింది. ముఖ్యంగా మొబైల్ డేటా ఖర్చు 96.6 శాతం తగ్గిందని, భారత్ ఇప్పుడు ఒక జీబీకీ కేవలం రూ. 8.9తో సరసరమైన ధరకు డేటా అందిస్తున్న ప్రపంచ అగ్రగామిగా ఉందని వెల్లడించారు.






