- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Elon Musk: భవిష్యత్తులో ఏఐ వల్ల 'ఆప్షనల్'గా మారనున్న ఉద్యోగాలు: ఎలన్ మస్క్
భవిష్యత్తు ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ అత్యాధునిక టెక్నాలజీ ఏఐ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఏఐ ఎలా ఉంటుందనే విషయాన్ని వాషింగ్టన్‌లోని యూఎస్- సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కారణంగా భవిష్యత్తులో మనుషులు వాడుతున్న కరెన్సీ అసంబద్ధం అవుతుందని, ఉద్యోగాలు 'ఆప్షనల్ 'గా మారుతాయని అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తు ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా.. మరో పది-ఇరవై ఏళ్లలో చేసేందుకు పనులు ఉండవు. అన్ని రకాల పనులు ఆప్షనల్‌గా మారుతాయి. ప్రస్తుతం మనం ఆడుతున్న స్పోర్ట్స్, వీడియో గేమ్స్ మాదిరిగానే ఉద్యోగాలు ఉంటాయి. కేవలం అభిరుచి కోసమే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. రోబోలు ఎక్కువ పని చేయడం, మనుషులు ఉద్యోగాలను ఆప్షనల్‌గా ఎంచుకోవడం వల్ల.. స్టోర్‌కు వెళ్లి కూరగాయలు కొనడానికి బదులుగా వాటిని ఇంట్లోనే పెంచుకుంటారు. పేదరికాన్ని ఇంజనీరింగ్ సమస్యగా పేర్కొన్న ఎలన్ మస్క్, దాన్ని ఏఐ తొలగిస్తుందన్నారు.






