- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Elon Musk: గుకేష్ దొమ్మరాజుకు అభినందనలు తెలిపిన ఎలాన్ మస్క్
దిశ, వెబ్‌డెస్క్: సింగపూర్(Singapur)లో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్-2024లో భారత యువ చెస్ సంచలనం గుకేష్ దొమ్మరాజు(Gukesh Dommaraju) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో చైనా(China)కు చెందిన డింగ్ లిరెన్(Ding Liren)ను ఓడించి ఈ ట్రోఫీ గెల్చుకున్న పిన్న వయస్కుడిగా గుకేష్ రికార్డు సృష్టించాడు. మొత్తం 14 గేములుగా జరిగిన ఈ టోర్నీలో గుకేష్ 7.5-6.5 తేడాతో విజయం సాధించి వరల్డ్ చెస్ ఛాంపియన్(Champion)గా అవతరించాడు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా(Social Media)లో వివిధ రంగాల ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే గూగుల్(Google) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్(sundar Pichai) గుకేష్ కు శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా ప్రపంచ కుబేరుడు టెస్లా(Tesla), స్పేస్ ఎక్స్(Space X) సంస్థల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) కూడా గుకేష్ దొమ్మరాజును అభినందించారు. ఈ మేరకు 'కంగ్రాట్స్(Congratulations)' అంటూ ఎక్స్(X)లో ట్వీట్ చేశారు. 18 సంవత్సరాలకే 18వ వరల్డ్ ఛాంపియన్ అని గుకేష్ చేసిన ట్వీట్(Tweet) కు మస్క్ రిప్లై ఇచ్చారు.