ఆంధ్రప్రదేశ్‌లో మొదటి 'బిగాస్' బ్రాండ్ డీలర్‌షిప్ ప్రారంభం!

by Web Desk |
ఆంధ్రప్రదేశ్‌లో మొదటి బిగాస్ బ్రాండ్ డీలర్‌షిప్ ప్రారంభం!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్రాండ్ బిగాస్ పేరుతో విక్రయాలు నిర్వహిస్తున్న ఆర్ ఆర్ గ్లోబల్ సంస్థ ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడలో మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. హితిక మోటార్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ డీలర్‌షిప్‌లో బిగాస్ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బీ8, ఏ2 మోడళ్లను విక్రయించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. షోరూం ప్రారంభించిన మొదటిరోజునే సంస్థ 60 బిగాస్ స్కూటర్లను డెలివరీ చేసి, అరుదైన మైలురాయిని సృష్టించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ ఆర్ గ్లోబల్ డైరెక్టర్, బిగాస్ వ్యవస్థాపకుడు హేమంత్ కబ్రా.. హితిక మోటార్స్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి షోరూమ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది.

ఈ డీలర్‌షిప్‌లలో వినియోగదారులు బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్‌ఫోలియో చూసేందుకు, టెస్ట్ డ్రైవ్ లాంటి మెరుగైన సౌకర్యాలను అందిస్తున్నాం. అలాగే, హితిక మోటార్స్‌తో భాగస్వామ్యం ద్వారా ఎలక్ట్రిక్ బైకులను సమర్థవంతంగా కస్టమర్లకు చేర్చగలమని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కీలక అడుగు గా నిలుస్తుందని' చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పాటు గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలను దృష్టిలో ఉంచుకుని బిగాస్ స్కూటర్ల షోరూమ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని హితిక మోటార్స్ ప్రొప్రైటర్ హర్షవర్ధన్ వెల్లడించారు.



Next Story

Most Viewed