- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vedanta: అనిల్ అగర్వాల్ మైనింగ్ సామ్రాజ్యంపై ఈడీ నిఘా
దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.

దిశ, బిజినెస్ బ్యూరో: విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేదాంత గ్రూపునకు చెందిన పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. బిలియనీర్ అనిల్ అగర్వాల్‌కు చెందిన ఈ మైనింగ్, మెటల్స్ దిగ్గజం సంస్థపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనే అంశంపై ఈ విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈడీ చర్యలను ధృవీకరించిన వేదాంత గ్రూప్, దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది. అధికారులు కోరిన సమాచారం మొత్తం అందిస్తున్నామని, అన్ని చట్టాలు, నియంత్రణ నిబంధనలను పాటించడానికి కంపెనీ కట్టుబడి ఉందని తెలిపింది. ప్రస్తుతం విషయం దర్యాప్తు దశలో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది. లోహాలు, కీలక ఖనిజాల ఉత్పత్తిలో ప్రధాన సంస్థగా ఉన్న వేదాంత కార్యకలాపాలు భారత్‌తో పాటు ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాల్లో విస్తరించి ఉన్నాయి.






