Anil Ambani:మరో రూ. 3,034 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు

by S Gopi |

జప్తు చేసిన ఆస్తుల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్-ఇన్‌ఫ్రా)కు చెందినవి ఉన్నాయి.

Anil Ambani:మరో రూ. 3,034 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ, ఆయన గ్రూప్ కంపెనీలకు సంబంధించి ఈడీ కొత్త ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కొత్తగా రూ. 3,034 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. జప్తు చేసిన ఆస్తుల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఆర్-ఇన్‌ఫ్రా)కు చెందినవి ఉన్నాయి. వీటిలో ముంబైలోని ఒక ఫ్లాట్, మహారాష్ట్రలోని ఖండాలా అనే హిల్ స్టేషన్‌లో ఒక ఫామ్‌హౌస్, సనంద్ (అహ్మదాబాద్)లోని కొన్ని భూములు, ఆర్-ఇన్‌ఫ్రాకు చెందిన 7.71 కోట్ల షేర్లు మొదలైనవి ఉన్నాయి. ఈ ఆస్తులను జప్తు చేయడానికి ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలిక జప్తు ఉత్తర్వును జారీ చేసింది. సంబంధిత వర్గాల ప్రకారం, రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్‌పై ఉన్న కేసులలో జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ ఇప్పుడు రూ. 19,344 కోట్లకు చేరింది. బ్యాంకు మోసం, నిధుల మళ్లింపు ఆరోపణలపై రిలయన్స్ గ్రూప్‌ను ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story